మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కొండాపూర్ లో భారీ వర్షం, ఇళ్లల్లోకి చేరిన డ్రైనేజీ నీటితో ప్రజల అవస్థలు.

 డ్రైనేజీ కబ్జాదారుల ఇల్లు క్షేమం! 

 కబ్జాలు తొలగించాలని  పోరాడే వారి ఇళ్ళలో మురికి  నీరు.

-- ప్రధాన రహదారి వరద నీటి మళ్లింపు తో  ఇళ్లలోకి వర్షపు నీరు. 

 ఈరోజు కొండాపూర్ లో  కురిసిన భారీ వర్షానికి ఇండ్లలో చేరిన వర్షపు నీటితో అవస్థలు.


 కొండాపూర్ చౌరస్తాలో ఈరోజు కురిసిన భారీ వర్షం.




Scv News Kasipet:--

కాసిపేట మండలం కొండాపూర్ యాప ప్రదాన రహదారి డ్రైనేజీని కబ్జాకు గురి కావడంతో  గత మూడు సంవత్సరాలు గా ప్రయాణికులు తీవ్రవస్థలు పడుతున్నా సంగతి విధితమే. దాన రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణికులు గుంతల్లో పడిగాయాల పాలవుతున్న సంబంధిత పంచాయితీ  అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులకు చలనం లేకుండా పోయింది. రహదారిపై తక్షణమే గుంతలు పూడ్చాలని ఇటీవల మండల ఆదివాసి, ప్రజా సంఘాల నాయకులు కొద్దిసేపు   ధర్నా నిర్వహించారు. వారం రోజుల్లో గుంతలకు శాశ్వత పరిష్కారం లేకుంటే పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహిస్తామని ప్రజా సంఘాల నాయకు హెచ్చరించారు. తరువాత గత రెండు రోజుల క్రితం దేవాపూర్ ఎస్సై   ఆంజనేయులు రోడ్డు మీద ఎత్తు పల్లాలను ప్రోక్లైన్తో   సరి చేశారు. డ్రైనేజీ కబ్జా చేసి పూడ్చిన ఒక నాయకుడు తెలివిగా తన ఇంటి ముందు ఎత్తు పోసుకోవడం తో ప్రధాన రహదారి పై నుండి వెళ్లే నీరంతా ఫారెస్ట్ గెస్ట్ హౌస్  సంధి లోకి మళ్ళింది. ఈరోజు ఉదయం కురిసిన భారీ వర్షానికి వరద నీరంతా ఇళ్లలోకి చొరబడి  కుటుంబాలు అవస్థలకు గురైనాయి. వర్షపు నీటి వరదకు బురద మొత్తం ఇళ్లలో చేరింది.

గత మూడు సంవత్సరాల క్రితం అధికార పార్టీ నాయకుడు మండల ప్రధాన రహదారి  పక్కనే ఉన్నా రహదారిని డ్రైనేజీ ని కబ్జా చేసి కారును తన భవనంలోకి వెళ్లేందుకు డ్రైనేజీని కూల్చి సిమెంట్ రోడ్ వేసుకు న్నాడు. అప్పటి వర్షానికి నీరు బయటకు వెళ్లకుండా వెనకకు మళ్ళీ ఇళ్లలోకి వచ్చింది. అప్పుడు కూడా కుటుంబాలు వరద నీరు ఇళ్లలోకి రావడంతో అవస్థలకు గురయ్యారు. అక్రమణాలపై పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన  అక్రమణాలు తొలగించడం వారికి సాధ్యం కాకపోవడంతో మురికి నీరు వెళ్లేందుకు  ప్రత్యామ్నాయంగా  దక్షిణం వైపు  పైపులైను వేసి ఆ సమస్య తీర్చారు. డ్రైనేజీ కబ్జాదారులు కుట్ర చేసి ప్రధాన రహదారిపై నుండి వెళ్లే వర్షపు నీటిని ఈ చిన్న డ్రైనేజీలోకి మళ్లించారు. యాప  కమాన్ నుండి వచ్చే పెద్ద వరద నీరు  పైపుల నుండి వెళ్ళక  ఇండ్లలోకి  లోకి వచ్చింది . మూడేళ్లుగా ప్రజలు అవస్థ పడుతున్న అధికార యంత్రాంగం, అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు పట్టించుకోకుండా గుంతల రహదారిపై సిగ్గు లేకుండా తిరుగుతున్నారని మండలవాసు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మండల అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులపై మండల వాసులు ఆగ్రహం.

 రాష్ట్ర రాజధానిలో  చె రువులను ఆక్రమించిన కబ్జాదారుల భవనాలను ఆస్తులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'హైడ్రాతో ' నిర్ధాక్షణంగా కూల్చి వేస్తూ ప్రజల మన్ననలు పొందుతు న్నారు.  కాసిపేట  మండలంలోని కాంగ్రెస్ నాయకులు మండల ప్రధాన రహదారిపై గత మూడు సంవత్సరాలు గా ప్రజలు డ్రైనేజీ ఆక్రమణలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారం లోకి  వచ్చి పది నెలలు గడుస్తున్నా  అక్రమణను తొలగించడం వీరికి చేత కావడం లేదు. ప్రజల ప్రధాన సమస్యలను పట్టించు కోకుండా గ్రూప్ తగాదాలతో అంతర్గత కలహాలతో సతమతవుతున్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు తమకు తామే నాయకులమంటూ విర్ర వీగుతున్నారని మండల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల ప్రధాన రహదారి క్రింద ఉన్న  పైపులైను డ్రైనేజీని ఆక్రమణలు తొలగించడం మండలాధికార పార్టీ నాయకులకు చేతకావడం లేదు. కనీసం సంబంధిత అధికారులకు మద్దతుగా నిలిచి డ్రైనేజ్ ఆక్రమణ తొలగించేందుకైనా సహకరించాలని లేకుంటే మండలంలోని గ్రామాల్లో తిరిగే నైతిక హక్కు లేదని రెండు వర్గాల కాంగ్రెస్ నాయకులను మండలవాసులు  హెచ్చరిస్తున్నారు. 

 డ్రైనేజీ ఆక్రమణల తొలగింపుకు   ప్రజా సంఘాల ఆధ్వర్యంలో  ఆందోళనకు సిద్ధం.

అధికార పార్టీ నాయకుల నిర్లక్ష్య వైఖరితో విసుగు చెందిన మండల ఆదివాసి ప్రజా సంఘాలు ఏకమై మండల ప్రధాన రహదారి  గుంతల సమస్య పరిష్కారం కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టా యి. ప్రభుత్వానికి ఇచ్చిన గడువులోగా రహదారిపై గుంతలకు  శాశ్వత పరిష్కారం చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడుతున్నాయి.